Khurshid Mahammad: బీహార్‌లో దారుణం.. అత్యాచారాన్ని అడ్డుకున్న తల్లీకూతుళ్లపై దాడి!

  • నవ వధువుపై అత్యాచారానికి యత్నించిన కౌన్సిలర్
  • తల్లితో కలిసి దౌర్జన్యాన్ని అడ్డుకున్న యువతి
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
  • యువతుల అక్రమ రవాణాలో ఖుర్షిద్‌పై పలు కేసులు

తనపై జరుగుతున్న అత్యాచారాన్ని తల్లితో కలిసి ఓ యువతి అడ్డుకుంది. దీంతో ఇద్దరినీ చితకబాది, గుండు కొట్టించి నడి రోడ్డుపై ఊరేగించారు. బీహార్‌లో వైశాలి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వార్డు కౌన్సిలర్ మహ్మద్ ఖుర్షిద్, మరి కొందరితో కలిసి నవ వధువుపై అత్యాచార యత్నం చేశాడు. వీరి దౌర్జన్యాన్ని ఆ యువతి తన తల్లితో కలిసి అడ్డుకుంది.

అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితులు, కాసేపటికి తిరిగి వచ్చి తల్లీకూతుళ్లను ఇంట్లో నుంచి బయటకు లాగి చితక బాదారు. అనంతరం ఇద్దరికీ గుండు కొట్టించి, నడిరోడ్డుపై ఊరేగించారు. దారుణాన్ని సహించలేని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఖుర్షిద్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. యువతుల అక్రమ రవాణాలో అప్పటికే ఖుర్షిద్‌పై పలు కేసులున్నట్టు విచారణలో తేలింది.

Khurshid Mahammad
Bihar
Police
Women Trofficking
Vyshali
  • Loading...

More Telugu News