Chandrababu: మా ఇంట్లో ఉండమని చంద్రబాబును కోరాను: రాయపాటి సాంబశివరావు

  • ఉండవల్లిలోని నివాసాన్ని చంద్రబాబు ఖాళీ చేస్తారు
  • గుంటూరులోని పార్టీ ఆఫీసుకు సమీపంలో బాబు ఉండొచ్చు
  • పార్టీ మారే నేతల గురించి నాకు తెలియదు

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఉంటున్న భవనాన్ని కూల్చివేసేందుకు సీఆర్డీఏ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త నివాసం గురించి ఇప్పటికే పలు గెస్ట్ హౌస్ లను పార్టీ నేతలు పరిశీలించారు. ఈ విషయమై టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ, ఉండవల్లిలోని నివాసాన్ని చంద్రబాబు ఖాళీ చేస్తారని, గుంటూరులోని పార్టీ ఆఫీసుకు దగ్గరలో చంద్రబాబు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును తమ ఇంట్లో ఉండమని కోరానని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ ఫిరాయింపు దారుల గురించి ప్రస్తావించగా, పార్టీ మారే నేతల గురించి తనకు తెలియదని అన్నారు.

  • Loading...

More Telugu News