Radhika Apte: అధిక బరువు కారణంగా సినిమా చేజారడం చిరాకు తెప్పించింది: రాధికా ఆప్టే

  • ‘విక్కీ డోనర్’‌లో కథానాయికగా ఎంపికైన రాధిక
  • విహార యాత్రకు వెళ్లిన కధానాయిక
  • మళ్లీ సన్నబడతానని వేడుకున్నా ప్రయోజనం శూన్యం

కథానాయిక రాధికా ఆప్టే తిండి విషయంలో ఇప్పుడు తెగ జాగ్రత్తగా ఉంటోందట. బరువు పెరగడమంటేనే చిరాకొస్తోందట. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ‘బీఎఫ్ఎఫ్’ అనే షోలో పాల్గొన్న రాధికా ఆప్టే తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తిక విషయాలను వెల్లడించింది. గతంలో తను బాగా మద్యం సేవించడంతో లావెక్కిపోయిందట. దీంతో ‘విక్కీ డోనర్’ చిత్రంలో కథానాయికగా వచ్చిన అవకాశాన్ని కోల్పోయిందట. ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైన అనంతరం చిత్రీకరణకు కాస్త సమయం ఉండటంతో రాధిక కొన్ని రోజుల పాటు విహార యాత్రకు వెళ్లింది.

అక్కడ బీరు తాగి, బాగా తిని లావైపోయింది. దీంతో చిత్రబృందం ఆమెను సినిమా నుంచి తప్పించింది. తనకు కొంత సమయమిస్తే మళ్లీ సన్నబడతానని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. రాధిక స్థానంలో చిత్రబృందం యామీ గౌతమ్‌ను తీసుకుంది. అప్పటి నుంచి తాను తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, సినిమా చేజారడం బాధ అనిపించలేదు కానీ బరువు కారణంగా తప్పిపోవడం చిరాకు తెప్పించిందని రాధిక ‘బీఎఫ్ఎఫ్’ షోలో వెల్లడించింది.

Radhika Apte
BFF
Vicky Doner
Yami Gowtham
Beer
Fat
  • Loading...

More Telugu News