Andhra Pradesh: ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. గుంటూరులో పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు!

  • దాచేపల్లి నుంచి తంగెడకు వెళుతున్న బస్సు
  • మార్గమధ్యంలో గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్
  • దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఘోర ప్రమాదం తప్పింది. దాచేపల్లి డిపో నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు తంగెడకు ఈరోజు బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ మట్టి దిబ్బను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా, డ్రైవర్ కూలబడిపోయాడు. దీంతో బస్సులోని మిగతా ప్రయాణికులు, డ్రైవర్ని, గాయపడ్డవారిని హుటాహుటిన దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Andhra Pradesh
Guntur District
driver
heart attack
rtc bus
  • Loading...

More Telugu News