Andhra Pradesh: అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాను కలసిన సీఎం జగన్ భార్య, పిల్లలు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-66f2eb7526ad53d31d58c6bb7199f46a2b56d05c.jpg)
- ప్రత్యేకంగా సమావేశమైన కాన్సుల్ జనరల్
- జగన్ ఘనవిజయం సాధించడంపై అభినందనలు
- వారి అమెరికా టూర్ సాఫీగా సాగాలని ఆకాంక్ష
హైదరాబాద్ లో అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాను ఈరోజు ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి, ఆయన కుమార్తెలు హర్షిణి, వర్ష కలుసుకున్నారు. అమెరికా కాన్సులేట్ లో హడ్డా వీరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయం సాధించడంపై ఆయన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. వర్ష త్వరలోనే చదువుల కోసం అమెరికాకు వెళ్లనున్న నేపథ్యంలో వీరి ప్రయాణం సాఫీగా సాగాలని కేథరిన్ హడ్డా ఆకాంక్షించారు. భారతి, హర్షిణి, వర్షలతో భేటీ అయిన విషయాన్ని హడ్డా ట్విట్టర్ లో పంచుకున్నారు.