Anantapur District: కమలం గూటికి టీడీపీ నేత గోనుగుంట్ల.. మూడు రోజుల క్రితమే అమిత్‌షాతో చర్చలు!

  • పార్టీలోకి ఆహ్వానం పలికిన చీఫ్‌
  • భవిష్యత్తు కార్యాచరణపై కేడర్‌తో సంప్రదింపులు
  • ధర్మవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపు

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు కావాల్సిన సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నారని, మూడు రోజుల క్రితం బీజేపీ చీఫ్‌ అమిత్‌షాతో చర్చించగా ఆయన ఆహ్వానం పలికారని సమాచారం.

వాస్తవానికి ఆయన గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి రామ్‌మాధవ్‌, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. తాజాగా షా నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో నిన్న ఆయన నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మండలాల వారీగా నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీలో చేరడం ఒక్కటే సరైన మార్గమని, స్థానిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఇది అనివార్యమని వారికి వివరించినట్లు తెలుస్తోంది. వచ్చేనెల ఐదో తేదీన కమలం గూటికి చేరేందుకు సూర్యనారాయణ ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నట్లు సమాచారం.

Anantapur District
dharmavaram
ex MLA gonuguntla
BJP
  • Loading...

More Telugu News