Nirav Modi: నీరవ్ మోదీకి భారీ షాక్.. 4 స్విస్ బ్యాంక్ ఖాతాలు సీజ్.. 280 కోట్లు స్వాధీనం!

  • జప్తు చేసిన స్విట్జర్లాండ్ అధికారులు
  • ఈడీ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్న స్విట్జర్లాండ్
  • ఇంకా బ్రిటన్ జైలులోనే వున్న నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,000 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి స్విట్జర్లాండ్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా నీరవ్ మోదీతో పాటు ఆయన సోదరి పూర్వీ మోదీకి చెందిన నాలుగు స్విస్ బ్యాంకు అకౌంట్లను ఈరోజు స్తంభింపజేశారు. భారత్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విజ్ఞప్తి మేరకు స్విస్ అధికారులు ఈ చర్య తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఈ నాలుగు ఖాతాల్లో దాచిఉంచిన 283.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ చట్టం కింద ఈ నగదుపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి పలుమార్లు రూ.13,000 కోట్ల వరకూ రుణాలు తీసుకున్న నీరవ్ మోదీ చివరికి వాటిని చెల్లించలేక బ్రిటన్ కు పారిపోయారు.

అక్కడే ఆశ్రయం పొందే క్రమంలో ఓ బ్యాంకుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడే పనిచేసే ఓ ఉద్యోగి సమాచారం అందివ్వడంతో పోలీసులు ఆయన్ను ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన వాండ్స్ వర్త్ జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం నీరవ్ మోదీ ఇప్పటివరకూ మూడుసార్లు దరఖాస్తు చేసుకోగా, అందుకు బ్రిటన్ లోని ఓ కోర్టు నిరాకరించింది.  బెయిల్ ఇస్తే నీరవ్ మళ్లీ కోర్టు ముందు హాజరు కాబోరని తాము భావిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

Nirav Modi
swiss accounts
4 bank accounts
280 crore seize
ed
britain
wandsworth jail
england
  • Loading...

More Telugu News