Paruchuri Gopalakrishna: కృష్ణగారి పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది... ఆయనను ఎవరైనా లోపలికి తీసుకెళితే బాగుండును!: పరుచూరి గోపాలకృష్ణ

  • విజయనిర్మల మృతి వార్త తెలియగానే కృష్ణ గురించే ఆలోచించా
  • ఆయన పరిస్థితి తలుచుకోగానే గుండె పట్టేసినట్టయింది
  • పసిపిల్లాడిలా అయిపోయారు

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణంతో టాలీవుడ్ మూగబోయింది. ఆమెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. ఆమె కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో, విజయనిర్మల మరణంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. విజయనిర్మల కన్నుమూయడంతో కృష్ణ పసిపిల్లాడిలా మారిపోయాడని, ఆయన విలపిస్తున్న తీరు చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. ఎవరైనా కృష్ణగారిని లోపలికి తీసుకెళితే బాగుండుననిపిస్తోందని విచారం వ్యక్తం చేశారు. విజయనిర్మల చనిపోయిందన్న వార్త తెలియగానే తాను మొదట ఆలోచించింది కృష్ణగారి గురించేనని, ఆయన పరిస్థితి ఏంటన్న విషయం తలుచుకోగానే గుండె కలుక్కుమందని అన్నారు. ఇలాంటి విషాద సమయంలో కృష్ణగారికి ఆత్మస్థయిర్యం కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Paruchuri Gopalakrishna
Krishna
Vijayanirmala
Tollywood
  • Loading...

More Telugu News