amala paul: కావాలనే నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు: హీరోయిన్ అమలా పాల్
- నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు
- నా వలన నిర్మాతలు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు
- ఇది నిర్మాతల ఈగో ప్రోబ్లమ్
తెలుగులో అవకాశాలు తగ్గి చాలాకాలమే అయినా, తమిళంలో మాత్రం అమలా పాల్ అవకాశాలను దక్కించుకుంటూనే వుంది. విజయ్ సేతుపతి కొత్త సినిమాలో నాయికగా అమలా పాల్ ను ఎంపిక చేసుకున్న నిర్మాతలు, ఆ తరువాత ఆ స్థానంలో మేఘా ఆకాశ్ ను తీసుకున్నారు. ఈ విషయం రకరకాల ఊహాగానాలకు కారణమైంది.
దాంతో అమలా పాల్ స్పందిస్తూ .. "నిర్మాతలకి సహకరించననే కారణం చెప్పి నన్ను ఈ ప్రాజెక్టు నుంచి తీసేశారు. వాళ్లు అలా అనేసరికి నాపై నాకు అనుమానం వచ్చి కెరియర్ పరంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. నా వలన నిర్మాతలకి ఇబ్బంది కలగకుండా నేను నడచుకున్న సంఘటనలే నాకు కనిపించాయి. ఈ సినిమా నిర్మాతలు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇది నా తప్పుకాదనీ .. నిర్మాతల ఈగో ప్రోబ్లమ్ అని నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చింది.