jeevitha: విజయనిర్మలగారితో ఎవరినీ పోల్చలేం: జీవితా రాజశేఖర్

  • విజయ నిర్మల గారి వ్యక్తిత్వం గొప్పది
  •  ఆమె సాధించిన విజయాలు అసమానం
  •  ఆమె ఆత్మకి శాంతి చేకూరాలన్న జీవితా రాజశేఖర్   

నటిగా .. దర్శకురాలిగా .. నిర్మాతగా విజయనిర్మల ఎన్నో ప్రయోగాలు చేశారు .. ప్రేక్షకులను అలరించారు. ఎన్నో విభిన్నమైన చిత్రాలు .. అవి సాధించిన విజయాలు ఆమె ఖాతాలో కనిపిస్తాయి. అలాంటి అరుదైన రికార్డును సాధించిన విజయనిర్మల బుధవారం రాత్రి గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెతో తమకి గల అనుబంధాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ .. " నటిగాను .. దర్శక నిర్మాతగాను విజయనిర్మల గారు ఎన్నో విజయాలను సాధించారు. వ్యక్తిగానూ ఆమె ఎంతోమందికి సహాయ సహకారాలను అందించారు .. ఆమెతో ఎవరినీ పోల్చలేం. మాకు తెలిసిన దగ్గర నుంచి ఒక ఆడపులిగానే ఆమెను చూస్తూ వచ్చాము. అలాంటిది ఈ మధ్య నడవడానికి ఆమె ఇబ్బంది పడుతుండటం చూసి బాధ కలిగింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము" అంటూ తమ సంతాపాన్ని తెలియజేశారు.

jeevitha
rajasekhar
  • Loading...

More Telugu News