Vijay Sai Reddy: ఏపీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • రాజ్యసభలో ప్రశ్న అడిగిన విజయసాయిరెడ్డి
  • పెట్రో కెమికల్ కాంప్లెక్స్ పై బదులిచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • రూ.5వేల కోట్ల వరకు వీజీఎఫ్ సమకూర్చుతామంటూ భరోసా

ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ప్రాజక్ట్ కు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా బదులిచ్చారు. రాయితీ ధరలకు నీరు, విద్యుత్ వంటి ప్రోత్సాహకాలతో పాటు సుమారు రూ.5వేల కోట్ల వరకు వీజీఎఫ్ సమకూర్చుతామని ప్రధాన్ వివరించారు. అవసరమైన అనుమతులు పొందడంలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ప్రాజక్ట్ సాకారమవుతుందని తెలిపారు.

Vijay Sai Reddy
Dharmendra Pradhan
  • Loading...

More Telugu News