chris gayle: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రిస్ గేల్
- టీమిండియాతో జరిగే సిరీస్ తర్వాత రిటైర్మెంట్
- 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం
- వన్డేల్లో 10 వేల పరుగుల క్లబ్ లో గేల్
వెస్టిండీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆగస్టులో టీమిండియాతో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని గేల్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన నిర్ణయాన్ని మార్చుకుని... ఇండియాతో సిరీస్ తర్వాత తప్పుకుంటానని తాజాగా వెల్లడించాడు. 1999లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గేల్... టీమిండియాతోనే చివరి మ్యాచ్ ఆడబోతుండటం గమనార్హం. వెస్టిండీస్ తరపును 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లను గేల్ ఆడాడు. టెస్టుల్లో 7,214 పరుగులు, వన్డేల్లో 10,345 రన్స్, టీ20ల్లో 1,627 పరుగులు సాధించాడు. ఆగస్ట్ లో విండీస్ తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.