Andhra Pradesh: నేను బీజేపీలో చేరలేదు.. వైసీపీలో చేరబోతున్నా: అంబికా కృష్ణ సోదరుడు రాజా

  • నేను బీజేపీలో చేరినట్టు వస్తున్న వదంతులు నమ్మొద్దు
  • నా సోదరుడు బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగతం
  • దివంగత సీఎం వైఎస్ అంటే నాకు ఎంతో అభిమానం

ఏపీ టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అంబికా కృష్ణ సోదరుడు అంబికా రాజా కూడా బీజేపీలో చేరారన్న వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో అంబికా రాజా స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబికా రాజా మాట్లాడుతూ, ఈ వదంతులను ఖండించారు. వాటిని నమ్మొద్దని కోరారు. తన సోదరుడితో పాటు తాను కూడా బీజేపీలో చేరినట్టు వస్తున్న వదంతులను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.

తన సోదరుడు బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత వ్యవహారమని, తాను మాత్రం వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షంలో త్వరలో వైసీపీలో చేరనున్నట్టు చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. వైసీపీలో ఎటువంటి పదవి ఆశించకుండా ఆ పార్టీలో తాను చేరబోతున్నట్టు స్పష్టం చేశారు.

Andhra Pradesh
YSRCP
bjp
ambika
krishna
Raja
minister
Alla nani
ys
Rajasheker reddy
  • Loading...

More Telugu News