: రేపు 254 కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశపరీక్ష ఐసెట్ రేపు జరుగనుంది. మొత్తం 254 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఐసెట్ కన్వీనర్ ఓం ప్రకాశ్ తెలిపారు. ఈ పరీక్షకు లక్షా 39 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక కీని ఈ నెల 19న విడుదల చేస్తామని, అలాగే ఈ నెల 25 లోపు ఫిర్యాదులను స్వీకరించనున్నామనీ, నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడిస్తామనీ కన్వీనర్ అన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసారు.