Chandrababu: నా ప్రాణమొకటీ, వాళ్ల ప్రాణమొకటీనా?: మంత్రి బొత్స

  • గత ఐదేళ్లలో ప్రభుత్వం నాకు భద్రత కల్పించిందా?
  • ఈ విషయాన్ని నేనెప్పుడైనా ప్రెస్ కు చెప్పానా?
  • చంద్రబాబు ఫ్యామిలీకి భద్రత తొలగింపుపై ఎందుకు రాద్ధాంతం?

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తొలగించారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణను విలేకరులు ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా, పదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా తాను పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం నాకు భద్రత కల్పించిందా? అని ప్రశ్నించారు. ఈ విషయమై నాడు ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తే ‘మీకు అవసరం లేదండి’ అని చెప్పిందని గుర్తుచేసుకున్నారు. అంతేగానీ, ఈ విషయాన్ని నేనెప్పుడైనా ప్రెస్ కు చెప్పానా? ఒక లెటర్ పెట్టానా?’ అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు కుటుంబసభ్యులకు భద్రత తొలగింపుపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే, తమకు ఒక చట్టం, వారికో చట్టమా? ‘నా ప్రాణమొకటీ, వాళ్ల ప్రాణమొకటీనా?’ అని బొత్స ప్రశ్నించారు.

Chandrababu
family
minister
Botsa Satyanarayana satya narayana
  • Loading...

More Telugu News