Kalava Srinivasulu: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా, ప్రజావేదిక కూల్చేందుకే కలెక్టర్ల సదస్సు నిర్వహించారు: కాలవ శ్రీనివాసులు

  • చంద్రబాబు అడిగినందునే కూల్చివేశారు
  • టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులను ఖండిస్తున్నాం
  • చంద్రబాబు నివాసంలో ముగిసిన టీడీపీ నేతల భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ మధ్యాహ్నం పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం గంటా శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు అధికారపక్షంపై మండిపడ్డారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా, ప్రజావేదిక కూల్చివేత కోసమే కలెక్టర్ల సదస్సు నిర్వహించారని మండిపడ్డారు. చంద్రబాబు అడిగినందునే కక్షతో ప్రజావేదిక కూల్చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గంటా స్పందిస్తూ, ప్రజావేదిక కూల్చివేయడం సరైంది కాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని  ఆరోపించారు. వైసీపీ చేస్తున్న ఈ దాడులపై రేపు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని  చెప్పారు.

Kalava Srinivasulu
Ganta Srinivasa Rao
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News