Andhra Pradesh: గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం: సీఎం జగన్

  • ఏపీ విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో సమీక్ష
  • ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్ల నష్టం వాటిల్లింది
  • 30 అంశాలపై విచారణ చేస్తాం: జగన్

గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఏపీ విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ అవినీతికి సంబంధించి 30 అంశాలపై విచారణ చేస్తామని, ఏసీబీ, సీఐడి, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థల సహకారం తీసుకుంటామని చెప్పారు.

ముందుగా విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై జగన్ దృష్టి సారించారు. సోలార్, వింగ్ పవర్ కొనుగోళ్లపై విస్తృత చర్చ జరిగింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్లు కన్నా అధిక రేట్లకు, విద్యుత్ ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని రికవరీ చేయాలి జగన్ ఆదేశించారు. ఆయా విద్యుత్ సంస్థలతో తిరిగి సంప్రదింపులు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు, సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వాటితో ఉన్న ఒప్పందాలు రద్దు చేయాలని జగన్ ఆదేశించారు. సోలార్, విండ్ కంపెనీల ఒప్పందాల్లో భారీ దోపిడీ ఉన్నందున ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి సీఎం, మంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు జగన్ ఆదేశించారు.

Andhra Pradesh
cm
jagan
current
enquiry
  • Loading...

More Telugu News