bjp: బీజేపీ నేత లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో పేలుడు

  • రత్నానగర్ లోని నివాసంలో పేలిన గ్యాస్ సిలిండర్
  • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
  • కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు

బీజేపీ నేత లక్షణ్ గౌడ్ నివాసంలో ఈ తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. హైదరాబాద్ బర్కత్ పుర, నల్లకుంట డివిజన్ రత్నానగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా దెబ్బతింది. అయితే, ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో... పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలిందన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 

bjp
lakshman gowd
gas cylinder
blast
hyderabad
  • Loading...

More Telugu News