Andhra Pradesh: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సు గడువు పొడిగింపు

  • రాష్ట్రంలో 4,377 మద్యం దుకాణాల గడువు పొడిగింపు
  • సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు
  • ఈ నెల 30తో ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సు గడువు

ఏపీలో ఈ నెల 30తో మద్యం దుకాణాల లైసెన్సు గడువు ముగియనున్న తరుణంలో ఓ ఆసక్తి పరిణామం చోటుచేసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సు గడువును పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 4,377 మద్యం దుకాణాల గడువును మూడు నెలల పాటు పొడిగించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల లైసెన్స్ పరిమితి ముగియగానే, మరింత కఠినంగా ఉండేలా కొత్త పాలసీని తీసుకువస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త పాలసీ ఆలస్యం కావడంతో పాత దుకాణాల లైసెన్సు గడువును ప్రభుత్వం పొడిగించింది.

Andhra Pradesh
bar
wine shops
liquor
licence
  • Loading...

More Telugu News