Andhra Pradesh: 2020 నాటికి మంగళగిరి ఎయిమ్స్ పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే

  • రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
  • నిర్ణీత కాల వ్యవధిలోనే సాగుతున్న నిర్మాణ పనులు
  • మార్చ్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఔట్ పేషెంట్ సేవలు 

ఏపీలోని మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్న విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్పష్టత ఇచ్చారు. ఎయిమ్స్ నిర్మాణం అంశం గురించి రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అశ్వినీ కుమార్ జవాబిస్తూ, కేంద్ర మంత్రి వర్గం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఎయిమ్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు నిర్ణీత కాల వ్యవధిలోనే సాగుతున్నందున నిర్మాణ వ్యయ అంచనాలు పెరిగే అవకాశం లేదని చెప్పారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్ లో ఔట్ పేషెంట్ విభాగం వైద్య సేవలు ప్రారంభమైన విషయాన్ని అశ్వినీ కుమార్ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News