Chandrababu: నాడు ఎన్టీఆర్ లా ‘జగన్ కూడా ప్రతి గ్రామానికి వెళ్లారు: పరుచూరి గోపాలకృష్ణ

  • జగన్ కు ‘ఒక్కసారి అవకాశం ఇవ్వాలి’ అని భావించారు
  • అందుకే, జగన్ కు ఓట్లు పడ్డాయేమో
  • బాబుకు పవన్ దూరమవడమే జగన్ విజయానికి కారణమని  చెప్పలేను

పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు ఎవరి పక్షాన ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పడానికి గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనమని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’లో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ రెండు జిల్లాల ప్రజల తీర్పే పార్టీకి విజయం కట్టబెడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఓ అద్భుతంగా ఆయన అభివర్ణించారు. ఈ విజయానికి కారణం.. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దూరమవడమని తాను చెప్పలేనని, ఎందుకంటే, తాను ఏపీలో లేను అని అన్నారు. తనకు అనిపిస్తున్న నిజం.. పదేళ్లుగా జగన్ ప్రజల మధ్య తిరిగారని, తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానన్నది స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 1983లో ఎన్టీఆర్ ప్రతి గ్రామంలోకి వెళ్లి ప్రజలతో ఎలా మాట్లాడారో, అలాగే, జగన్ కూడా వెళ్లారని, జగన్ కు ‘ఒక్కసారి అవకాశం ఇవ్వాలి’ అని ప్రజలు భావించడంతో ఆయనకు ఓట్లు పడ్డాయేమోనని పరుచూరి అన్నారు.

Chandrababu
Pawan Kalyan
jagan
paruchuri
  • Loading...

More Telugu News