Srujana Chowdary: టీడీపీని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు!: సుజనా చౌదరి

  • టీడీపీ అంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది
  • ఇప్పుడు కూడా నేనేమీ అనాలనుకోవడం లేదు
  • రాజకీయాల్లో ప్రత్యర్థులుండాలి.. శత్రుత్వం ఉండకూడదు

టీడీపీ తనకు రాజకీయంగా మాతృ సంస్థ అని, టీడీపీని విమర్శించాల్సిన అవసరం తనకు లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టీడీపీ అంటే తనకెప్పుడూ గౌరవం ఉంటుందని, టీడీపీని ఇప్పడు కూడా తానేమీ అనాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. టీడీపీకి తిరిగి వైభవం ఎప్పుడు వస్తుందనేది తాను ఇప్పుడైతే చెప్పలేనన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి కానీ శత్రుత్వం మాత్రం ఉండకూడదని తాను భావిస్తున్నానని సుజనా చౌదరి పేర్కొన్నారు.

Srujana Chowdary
Telugudesam
BJP
Political Rivalary
Enemity
  • Loading...

More Telugu News