call money: కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు.. బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై పోలీసులకు ఫిర్యాదు

  • డీజీపీ, విజయవాడ సీపీలకు ఫిర్యాదు  
  • టీడీపీ నేతల పాత్రపై విచారణ చేయాలని వినతి 
  • ఈ కేసును రీ వెరిఫై చేయాలని కోరిన బూరగడ్డ అనిల్  

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు వ్యవహారం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగియనుంది. ఇందులో టీడీపీ నేతల పాత్రపై విచారణ చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గతంలో డీజీపీ ఠాకూర్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చెన్నుపాటి శ్రీను, యలమంచిలి రాములుతో పాటు బుద్ధా వెంకన్న, బోండా ఉమాలను కూడా విచారణ చేయాలని, ఈ కేసును రీ వెరిఫై చేయాలని కోరారు.

call money
S*x rocket
bonda uma
buddha uma
  • Loading...

More Telugu News