Vijayawada: నిన్న గంట పాటు చర్చలు... నేడు మళ్లీ పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన వంగవీటి రాధా!

  • పటమటలోని పవన్ నివాసానికి వచ్చిన రాధా
  • త్వరలోనే జనసేనలో చేరే అవకాశం
  • ఇంకా అధికారికంగా వెల్లడించని రాధా

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఈ ఉదయం మరోసారి సమావేశమయ్యారు. నిన్న విజయవాడ పటమటలోని పవన్ నివాసానికి వచ్చి, దాదాపు గంట పాటు మంతనాలు సాగించిన రాధా, ఈ ఉదయం మరోసారి వచ్చారు.

ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారని, ఈ ఉదయం భేటీలో ప్రధానంగా ఇదే విషయం చర్చకు వచ్చిందని, వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా రాధా, జనసేనలో చేరుతారని తెలుస్తోంది. వచ్చే నెల 4 లేదా 5వ తేదీల్లో పార్టీలో చేరికకు ముహూర్తం నిర్ణయించడం కూడా జరిగిపోయిందని జనసేన వర్గాలు అంటున్నాయి. కాగా, వీరిద్దరి భేటీపై అటు జనసేన పార్టీ తరఫున గానీ, ఇటు వంగవీటి రాధా నుంచి గానీ, అధికారికంగా ఎటువంటి స్పందనా లేదు.

Vijayawada
Patamata
Pawan Kalyan
Radha
Jana Sena
  • Loading...

More Telugu News