India: భారత్ చేతిలో ఓటమి బాధ కలిగించింది... ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్

  • ఆదివారం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
  • వరుస ఓటములు ఎదురైతే ప్రజలకు సమాధానం చెప్పాలి
  • ఆర్థర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమి పాలయ్యాక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని ఆ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ పేర్కొన్నాడు. తాజాగా, మీడియాతో మాట్లాడిన ఆర్థర్.. పాక్ ఓటమి తనను తీవ్రంగా బాధించిందని, గత ఆదివారం ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చిందన్నాడు.

ప్రపంచకప్‌లో ఓటములు ఎదురైతే ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో ఫఖార్ జమాన్, ఇమాముల్ హక్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చినా, వారు అవుటయ్యాక ఆందోళన మొదలైందన్నాడు. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నాడు. ఆర్థర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతడు కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సి వుండాల్సిందని అంటున్నారు. మ్యాచ్‌లను మ్యాచుల్లాగే చూడాలని సూచిస్తున్నారు.

India
Pakistan
Mickey Arthur
world cup
  • Loading...

More Telugu News