Rajasekhar: రాజశేఖర్ కుమార్తె శివానీ చాలెంజ్ ను స్వీకరించిన యంగ్ హీరో కార్తికేయ

  • కల్కి చిత్రంలో హార్న్ ఓకే ప్లీజ్ కు డ్యాన్స్ చేసిన కార్తికేయ
  • రాజశేఖర్ పై ప్రశంసలు
  • ట్విట్టర్ లో వీడియో

టాలీవుడ్ వెటరన్ హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమాలోని హార్న్ ఓకే ప్లీజ్ అనే సాంగ్ ఇటీవలే రిలీజైంది. ఈ ఐటమ్ సాంగ్ కు ఎవరైనా డ్యాన్స్ చేసి ఆ వీడియోను షేర్ చేయండి అంటూ కొన్నిరోజుల క్రితం రాజశేఖర్ ఓ చాలెంజ్ మొదలుపెట్టారు. దాన్ని రాజశేఖర్ కుమార్తె శివానీ ట్వీట్ చేయగా, ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఆ చాలెంజ్ ను స్వీకరించాడు. హార్న్ ఓకే ప్లీజ్ సాంగ్ కు తనదైన శైలిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు.

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ, 'మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నా ఇప్పటికీ మీకు సినిమాలపై ఉన్న అనురక్తి అద్భుతం, అందరికీ స్ఫూర్తిదాయకం. మీ సినిమాలు చూస్తూ పెరిగాం సర్' అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, రాజశేఖర్ కుమార్తె శివానీని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశాడు. శివానీ, హార్న్ ఓకే ప్లీజ్ పాటకు నేను చేసిన డ్యాన్స్ నీకు నచ్చుతుందని అనుకుంటున్నా అని ట్వీట్ చేశాడు.

Rajasekhar
Kalki
Karthikeya
Shivani
Horn OK Plese
  • Error fetching data: Network response was not ok

More Telugu News