Janasena party: ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక హోదా సాధ్యం: పవన్ కల్యాణ్

  • ప్రత్యేక హోదాకు కట్టుబడిన ఏకైక పార్టీ ‘జనసేన’  
  • ‘హోదా’ అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కు
  • మాటలు మారుస్తున్న నాయకులపై ఎదురుతిరగాలి 

ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక హోదాను సాధించగలమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విజ‌య‌వాడలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో ఈరోజు నిర్వహించిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ,  ‘హోదా’ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని, ప్రజా ఉద్యమం మొద‌లైతే దానిని ముందుకు తీసుకెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ప్ర‌త్యేక హోదాపై అన్నిపార్టీలూ మాట‌ మార్చినా ‘హోదా’ డిమాండ్ కు క‌ట్టుబ‌డి ఉన్న ఏకైక పార్టీ ‘జ‌న‌సేన’ మాత్రమే అని తెలిపారు. ‘హోదా’పై మాటలు మారుస్తున్న నాయకులకి ప్రజలే ఎదురుతిరగాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికల గురించి ప్రశ్నించగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని చెప్పిన పవన్, జమిలి ఎన్నికలు వస్తే సిద్ధమేనని స్పష్టం చేశారు.

Janasena party
Pawan Kalyan
AP
special status
  • Loading...

More Telugu News