Deepika Padukone: ఎయిర్ పోర్టులో నవ్వుతూ ఐడీ కార్డు చూపించిన దీపిక.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు

  • ఎయిర్‌పోర్టులో ఐడీ అడిగిన సెక్యూరిటీ గార్డు
  • నవ్వుతూ వెళ్లిపోయిన దీపిక
  • ఐడీ చూపించాల్సిందేనన్న సెక్యూరిటీ గార్డు
  • మళ్లీ వెనక్కి వచ్చి ఐడీ చూపించిన దీపిక

సెలబ్రిటీలు చాలామంది కాస్తంత గర్వం ప్రదర్శిస్తుంటారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరుగాంచిన దీపికా పదుకునే మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. తాజాగా, ముంబై ఎయిర్ పోర్టులో ఆమె వ్యవహరించిన హుందాతనమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎయిర్ పోర్టులోకి దీపిక వెళ్లగానే సెక్యూరిటీ గార్డు.. మేడం ఐడీ ప్లీజ్ అని అడగ్గా.. ఆమె నవ్వుతూ ముందుకెళ్లిపోయారు.

అయితే సెక్యూరిటీ మాత్రం ఐడీ చూపించాల్సిందేనంటూ అడగడంతో మళ్లీ వెనక్కి వచ్చి,
తన బ్యాగ్‌లోంచి ఐడీకార్డు తీసీ సెక్యూరిటీకి చూపించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. బహుశా ఇంకొకరెవరైనా అయితే చిర్రుబుర్రులాడి నానా రచ్చ చేసేవారేమో కానీ దీపిక మాత్రం ఎక్కడా సహనం కోల్పోకుండా హుందాగా వ్యవహరించింది.

 ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సూపర్బ్ దీపికా.. మీరు కేక అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. దీపికాతో పాటు సెక్యూరిటీని సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Deepika Padukone
Celebreties
Security Guard
Airport
Bollywood
ID
  • Loading...

More Telugu News