adhir ranjan chowdhury: అభినందన్ మీసాలపై లోక్ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరి

  • అభినందన్ కు అవార్డు ఇవ్వాలి
  • సోనియా, రాహుల్ ను దొంగలుగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు
  • వారు దొంగలైతే.. పార్లమెంటులో ఎలా కూర్చుంటారు?

లోక్ సభలో ఈరోజు ఓ ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ కు అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, అభినందన్ మీసాలను 'జాతీయ మీసాలు'గా ప్రకటించాలని కోరారు.

2జీ, బొగ్గు కుంభకోణాల్లో నిందితులెవరినైనా మీరు పట్టుకున్నారా? అంటూ బీజేపీని ఉద్దేశించి అధిర్ ప్రశ్నించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను దొంగలుగా ప్రచారం చేస్తూ మీరు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నిజంగా వారిద్దరూ దొంగలే అయిఉంటే వారిని మీరు జైల్లో పెట్టగలిగారా? అని ప్రశ్నించారు. ఒకవేళ వారిద్దరూ దొంగలే అయిఉంటే పార్లమెంటులో వారు ఎలా కూర్చుంటారని అధికార పక్షాన్ని నిలదీశారు.

adhir ranjan chowdhury
abhinandan moustache
Sonia Gandhi
Rahul Gandhi
congress
BJP
  • Loading...

More Telugu News