Telugudesam: కూల్చివేస్తామన్న ప్రజావేదికలోనే సమావేశం నిర్వహిస్తారా?: బుద్ధా వెంకన్న

  • అక్కడే సమావేశం నిర్వహించడం కరెక్టు కాదు
  • ప్రజావేదికను కూల్చివేస్తామనడం కక్షసాధింపు చర్యే
  • ప్రజా ధనాన్ని వృథా చేయొద్దు

ప్రజావేదికను కూలగొడతానని చెబుతున్న సీఎం జగన్, అక్కడే సమావేశం నిర్వహించడం కరెక్టు కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు నిర్వహించే కలెక్టర్లతో సమావేశం పూర్తయిన తర్వాత ఈ వేదికను కూల్చేస్తామని జగన్ చెబుతున్నారని, ఇది కచ్చితంగా కక్షపూరిత చర్యేనని విమర్శించారు.

ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబునాయుడు కోరారని, అది కేటాయిండం ప్రభుత్వానికి ఇష్టం లేకనే కూల్చివేస్తున్నట్టు ప్రకటించిందని విమర్శించారు. ఆ వేదికను చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేకపోతే దానిని మరోవిధంగా ప్రభుత్వం ఉపయోగించుకోవాలే తప్ప ప్రజా ధనాన్ని వృథా చేయకూడదని సూచించారు.

Telugudesam
Chandrababu
buddha venkanna
praja vedika
  • Loading...

More Telugu News