rawalpindi: పాకిస్థాన్ మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు.. తీవ్రంగా గాయపడ్డ మసూద్ అజార్!

  • రావల్పిండిలోని ఆర్మీ ఆసుపత్రిలో పేలుడు
  • ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ అజార్
  • మసూద్ తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం 

పాకిస్థాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉండే రావల్సిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ కూడా ఉన్నాడని చెబుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

మసూద్ అజార్ తీవ్ర అనారోగ్యంతో ఈ ఆసుత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని... ఒక ప్రణాళికాబద్ధంగానే దాడి చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు, ఘటనా స్థలి వద్దకు వెళ్లేందుకు మీడియాకు కూడా ఆర్మీ అధికారులు అనుమతినివ్వలేదు.

rawalpindi
army
hospital
blast
masood azhar
wound
  • Error fetching data: Network response was not ok

More Telugu News