Andhra Pradesh: అనంతపురంలో రోడ్డెక్కిన రైతులు.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్!
- వేరుశనగ విత్తనాలు ఇవ్వడం లేదని ఆగ్రహం
- న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్న రైతన్నలు
- ఘటనాస్థలికి చేరుకుని చర్చలు జరుపుతున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ఊపందుకోవడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే నిర్ణీత సమయంలోగా అధికారులు విత్తనాలు సమకూర్చకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల రైతులు ఈ రోజు ఆందోళనకు దిగారు.
పంటల సీజన్ సమీపించినా అధికారులు తమకు వేరుశనగ విత్తనాలను అందించడం లేదని జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో కొన్ని కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తమకు న్యాయం జరిగే వరకూ రోడ్డుపై నుంచి పక్కకు జరగబోమని రైతులు స్పష్టం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చిస్తున్నారు.