ongc: సఖినేటిపల్లి వద్ద పేలిన ఓఎన్జీసీ గ్యాస్ పైప్!

  • కేశవదాసుపాలెం పొలాల్లో ఘటన
  • పెద్ద పెద్ద శబ్దాలతో బయటకు వస్తున్న సహజవాయువు
  • ఇంకా చేరుకోని ఓఎన్జీసీ సిబ్బంది

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో  ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ పేలింది. పేలిన పైప్ లైన్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో సహజవాయువు బయటకు వెలువడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఉదయం పొలాల్లో దూరంగా మంటలు వస్తుండటాన్ని చూసిన స్థానికులు విషయాన్ని అధికారులకు చేరవేశారు. ఈ ప్రాంతంలో గతంలోనూ గ్యాస్ పైప్ లైన్లు లీక్ అయ్యాయి. ఇప్పటికి ఓఎన్జీసీ సిబ్బంది ఇంకా అక్కడికి చేరుకోలేదని తెలుస్తోంది. అధికారులు వెంటనే వచ్చి మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ongc
East Godavari District
Sakinetipalli
Blast
  • Loading...

More Telugu News