MAA: ‘మా’ ముఖ్యసలహాదారుడిగా సినీనటుడు కృష్ణంరాజు ఎన్నిక

  • ‘మా’ అధ్యక్షుడిగా నరేశ్ ఆధ్వర్యంలో తొలి సర్వసభ్య సమావేశం
  • ‘మా’లోని సభ్యులకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం 
  • త్వరలో నటీనటుల సంఘం భవనం నిర్మిస్తాం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ (మా) ముఖ్య సలహాదారుడిగా మాజీ ఎంపీ, సినీ నటుడు కృష్ణంరాజును ఎన్నుకున్నారు. ‘మా’ అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నికైన తర్వాత తొలి సర్వసభ్య సమావేశం ఈరోజు నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, ‘మా’లోని సభ్యులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఫిల్మ్ నగర్ లో నటీనటుల సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయిస్తుందని చెప్పారు.

అనంతరం, రాజశేఖర్ మాట్లాడుతూ, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్, మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా లిద్దరూ కలిసి అన్నీ సరిచేశారని, సంతోషించాల్సిన విషయమని అన్నారు. ‘మా’ కుటుంబం చాలా అన్యోన్యంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు దంపతులతో పాటు ప్రముఖ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్, సీనియర్ నటుడు దేవదాస్ కనకాలను సత్కరించారు.

MAA
President
Naresh
Hero
Rajasheker
  • Loading...

More Telugu News