New Delhi: కేజ్రీవాల్ చిత్రాన్ని గీసిన చిన్నారి..‘సో క్యూట్..’ అంటూ ప్రశంసలు

  • చిన్నారి గీసిన నా చిత్రం చాలా బాగుంది
  • ఫోన్ నెంబర్ పంపించండి
  • మిమ్మల్ని ఎప్పుడు కలిసేది నిర్ణయిస్తా: కేజ్రీ స్పందన

సామాజిక మాధ్యమాల వేదికగా సెలెబ్రిటీలను ప్రశంసిస్తూ, పొగుడుతూ వచ్చే పోస్టింగ్స్ చూస్తూనే ఉంటాం. ఈవిధంగా ప్రశంసలు పొందే వారిలో సినీ నటులు, రాజకీయనాయకులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటూ ఉంటారు.

తాజాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై అభిమానంతో ఓ చిన్నారి అభిమాని ఆయన చిత్రాన్ని గీసింది. ఈ చిత్రాన్ని చూసిన కేజ్రీవాల్ సంతోషపడుతూ ‘వావ్, సో క్యూట్..’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అయితే, ఆ చిన్నారి గీసిన చిత్రాన్ని ఆమె కాకుండా వారి పేరిట గుర్లివ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం.

ఇవాళ తమ సోదరి అరవింద్ కేజ్రీవాల్ అంకుల్ చిత్రం గీసిందని, తామిద్దరం అతనికి చాలా పెద్ద అభిమానులమని, ఆయన్ని ఓసారి కలవాలని అనుకుంటున్నామని, దయచేసి, తమ కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నట్టు చిన్నారుల పేరిట గుర్లివ్ సింగ్ చేసిన ట్వీట్ లో ఉంది.

ఈ ట్వీట్ పై కేజ్రీవాల్ స్పందిస్తూ, తన చిత్రం చాలా బాగుందని, చిన్నారులు ఇద్దరిని తప్పకుండా కలుస్తానని చెప్పారు. వారి ఫోన్ నెంబర్ పంపిస్తే, ఎప్పుడు కలిసేది నిర్ణయిస్తామని కేజ్రీవాల్ బంధించారు. కేజ్రీవాల్ స్పందనకు సంతోషపడుతున్న చిన్నారులు, తమ కల నెరవేరబోతోందని, తాను, తన చెల్లి ఆయన్ని కలిసేందుకు నిరీక్షిస్తున్నామని అన్నారు.

New Delhi
cm
kejriwal
picture
children
  • Error fetching data: Network response was not ok

More Telugu News