Crime News: క్షణికావేశం...ప్రేమ జంట ఆత్మహత్య : ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

  • పెద్దలు ఒప్పుకోరన్న అనుమానంతో తీవ్ర నిర్ణయం
  • ఇంటి నుంచి పారిపోయి ఆత్మహత్య
  • చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం

ప్రేమ బాసలు చేశారు...పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంట్లో పెద్దలకు తెలిస్తే ఏమయిపోతుందో అన్న ఆందోళనతో క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు కుటుంబాలకు తీరని విషాదం మిగిల్చారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కొయిలాడ మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి రవి (19), డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న రాధిక (20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసి మందలించారు. దీంతో తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరేమో, విడదీస్తారేమో అన్న భయంతో ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఇంటి నుంచి పారిపోయారు. రెండు రోజుల తర్వాత ఇరు కుటుంబాల వారు రవి, రాధిక అదృశ్యమైనట్లు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.  ఈ నేపథ్యంలో ఆదివారం కొందరు కనాయిపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరులు గ్రామ సమీపంలో ఉన్న ఎలిగ గట్టు గుట్టపై చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. వారు విషయం పోలీసులకు తెలియజేయగా వారు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలికి చేరుకుని అవి రవి, రాధిక మృతదేహాలని గుర్తించడంతో మిస్టరీ వీడిపోయింది.

Crime News
lovers suicide
mahabubnagar district
  • Loading...

More Telugu News