RAm: మామా డేట్ చేంజ్ హువా... గదే తోపు: హీరో రామ్

  • ఇస్మార్ట్ శంకర్ విడుదల తేదీ జూలై 12
  • వరల్డ్ కప్ జరుగుతుండటంతో ఆరు రోజులు పోస్ట్ ఫోన్
  • జూలై 18న విడుదల చేస్తామన్న రామ్

ఓ వైపు వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతున్న వేళ, తమ సినిమా విడుదలైతే, ఓపెనింగ్స్ తగ్గుతాయని భావించారో ఏమో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తయారైన 'ఇస్మార్ట్‌ శంకర్‌' విడుదల తేదీ వాయిదా పడింది. రామ్ తో పాటు నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ నటిస్తున్న సినిమా విడుదలను జూలై 12 నుంచి 18కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. 12న వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతోనే నిర్మాతలు చార్మీ, పూరీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. "మామా డేట్ చేంజ్ హువా...కానీ గదే తోపు... గదే తొపు... ఛే దిన్ కే బాద్ 18-07-2019 కీ కిరికిరీ" అని తెలంగాణ యాసలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమా ట్రయిలర్ ఇటీవల విడుదల కాగా, రామ్ డైలాగ్ డెలివరీ అభిమానులను ఆశ్చర్య పరిచింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి.

RAm
Ismart Shankar
Release Date
Cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News