TikTok: ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడి ఘటనపై స్పందించిన టిక్‌టాక్ యాజమాన్యం
- ప్రకటన విడుదల చేసిన టిక్‌టాక్ యాజమాన్యం
- ప్రమాదకరమైన ఛాలెంజ్‌లను ప్రోత్సహించబోమని స్పష్టం
- నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్‌కు స్థానం లేదని వెల్లడి
తల్లి మెడలోని మంగళసూత్రం అడిగి తీసుకుని టిక్‌టాక్ చేద్దామని వెళ్లిన 12 ఏళ్ల బాలుడు అనుకోని పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఇటీవల రాజస్థాన్‌లో జరిగింది. తల్లి దగ్గర మంగళసూత్రం తీసుకొని బాత్రూమ్‌లోకి వెళ్లి తన మెడలో వేసుకుని టిక్‌టాక్ చేయబోయాడు. కానీ మంగళసూత్రం బాత్రూమ్ తలుపు గడియకు చిక్కుకుని బాలుడి మెడకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు.
ఈ విషయమై సర్వత్ర టిక్‌టాక్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఘటనపై టిక్‌టాక్ యాజమాన్యం స్పందించి ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రమాదానికి కారణమయ్యే ఛాలెంజ్‌లను వేటినీ టిక్‌టాక్ ప్రోత్సహించదని స్పష్టం చేసింది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌కు తమ ప్లాట్‌ఫామ్‌లో స్థానం లేదని ప్రకటనలో తెలిపింది.