Harish Rao: నియోజకవర్గంలో పెళ్లికి హాజరైన హరీశ్ రావు.. వివాహ వేదికపై అవాక్కయిన వైనం!

  • పండ్ల మొక్కలను ఇప్పించిన పెళ్లి పెద్దలు
  • ప్రజల్లో వచ్చిన చైతన్యానికి ఆనందించిన హరీశ్
  • ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలి

సిద్దిపేట నియోజకవర్గంలో నేడు జరిగిన ఓ పెళ్లికి ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు. ఆయన నూతన దంపతులను ఆశీర్వదించేందుకు స్టేజి మీదకు వెళ్లగానే పెళ్లి పెద్దలు చేసిన పనికి అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే, నూతన దంపతులను ఆశీర్వదించేందుకు హరీశ్‌రావు వేదికపైకి వెళ్లగానే, పెళ్లికి వచ్చిన అతిథులందరికీ ఆయనతో పండ్ల మొక్కలను ఇప్పించారు. దీంతో ఆశ్చర్యపోయిన హరీశ్, ప్రజల్లో వచ్చిన  చైతన్యానికి ఆనందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, పెళ్లి వేడుకకు హాజరైన అతిథులకు జ్ఞాపికలను ఇవ్వడం చూస్తుంటామని, కానీ మొక్కలను ఇవ్వడం చూస్తే సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి ఆరాధకులకు ఎప్పుడూ మంచే జరుగుతుందన్నారు. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, మీ పెళ్లి ఒక స్ఫూర్తి అని, మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెళ్లికూతురు తండ్రికి తన అభినందనలు అని తెలిపారు. ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు.

Harish Rao
Marriage
Plants
Siddipet
  • Loading...

More Telugu News