dera baba: వ్యవసాయం చేసుకుంటానంటూ దరఖాస్తు చేసిన డేరాబాబా

  • పెరోల్ కోసం దరఖాస్తు చేసిన డేరాబాబా
  • క్షమించరాని నేరాలేం చేయలేదన్న బాబా
  • దరఖాస్తును పరిశీలిస్తున్న జైలు అధికారులు

ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో పాటు, వివిధ కేసుల్లో డేరాబాబా జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత 23 నెలలుగా సిర్సా జైల్లో డేరా బాబా ఉంటున్నాడు. తాజాగా అతని మనసు వ్యవసాయం మీదకు మళ్లింది. ఆశ్రమంలో వ్యవసాయం చేసుకుంటానని... తనకు పెరోల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. తాను చేసింది క్షమించరాని నేరాలేం కావని, పైగా జైల్లో తన ప్రవర్తన చాలా బాగుందని దరఖాస్తులో పేర్కొన్నాడు. పెరోల్ కు తాను అర్హుడినే అని చెప్పాడు. జైలు అధికారులు ప్రస్తుతం ఈ దరఖాస్తును పరిశీలిస్తున్నారు.

dera baba
perole
  • Loading...

More Telugu News