RTC Bus: బస్సులో కండక్టర్‌తో పాటు మరో ఇద్దరిపై సైకో దాడి

  • మందపల్లి - ముష్టిబండకు వెళుతుండగా ఘటన
  • చితకబాది పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు
  • సైకో నుంచి నాలుగు కత్తులు స్వాధీనం

ఆర్టీసీ బస్సులో ఓ సైకో ప్రయాణికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. దీంతో సైకోను ప్రయాణికులంతా కలిసి చితకబాది పోలీసులకు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందపల్లి నుంచి ముష్టిబండకు బస్సు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సులోకి ఎక్కిన ఓ సైకో లేడీ కండక్టర్‌తో పాటు మరో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రయాణికులంతా కలిసి మూకుమ్మడిగా సైకోను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతని నుంచి నాలుగు కత్తులను సైతం ప్రయాణికులు స్వాధీనం చేసుకున్నారు.

RTC Bus
Pshycho
Passengers
Conductor
Police
  • Loading...

More Telugu News