Andhra Pradesh: ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు రాజీనామా

  • విజయరాజును బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
  • ఈలోపే రాజీనామా చేసిన విజయరాజు
  • విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి పంపిన రాజీనామా లేఖ 

ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి పంపారు. కాగా, విజయరాజును బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో తన పదవికి ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈరోజు నిర్వహించిన వీసీల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. సచివాలయానికి ఆయన వెళ్లినా ఈ సమావేశానికి వెళ్లకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన  జ్ఞానభేరి కార్యక్రమంలో విజయరాజు కీలకపాత్ర పోషించారు.

Andhra Pradesh
Education
chairman
vijayaraju
  • Loading...

More Telugu News