sensex: యుద్ద భయాలు.. కుప్పకూలిన మార్కెట్లు

  • అమెరికా, ఇరాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తత
  • అమెరికా దాడి చేస్తుందనే భయాందోళనలు
  • 407 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో... ఇరాక్ పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే భయాందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. రూపాయి విలువ బలహీనపడటం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 407 పాయింట్లు పతనమై 39,194కి పడిపోయింది. నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 11,724 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.28%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.92%), వేదాంత లిమిటెడ్ (0.23%),  మహీంద్రా అండ్ మహీంద్రా (0.10%), యాక్సిస్ బ్యాంక్ (0.06%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-4.36%), మారుతి సుజుకి (-3.39%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-2.63%), హీరో మోటో కార్ప్ (-2.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.04%).

  • Loading...

More Telugu News