Andhra Pradesh: ఏపీకి నష్టం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వెళతారు?: టీడీపీ నేత వేదవ్యాస్
- ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు జగన్ వివరణ ఇవ్వాలి
- ఏపీకి వచ్చే నీటిని తన గుప్పిట్లో పెట్టుకునే యత్నం
- కేసీఆర్ పైనా విమర్శలు చేసిన వేదవ్యాస్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ హాజరుకావడంపై టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాప్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి నష్టం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వెళతారని ప్రశ్నించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్, వైసీపీ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఏపీకి వచ్చే నీటిని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.