Andhra Pradesh: విశాఖ, విజయవాడ, తిరుపతిలో ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం!: మంత్రి అవంతి శ్రీనివాస్

  • త్వరలోనే అమలుచేస్తామన్న టూరిజం మంత్రి
  • దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని వెల్లడి
  • దేశ,విదేశాల నుంచి టూరిస్టులు క్రమంగా పెరుగుతున్నారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టుల్లో విదేశీ టూరిస్టులకు త్వరలోనే ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం కల్పిస్తామని  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ మూడు విమానాశ్రయాల్లో విదేశీ పర్యాటకులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. టూరిజం విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించగా, ఏపీ 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీకి దేశ,విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు క్రమంగా పెరుగుతున్నారని గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో విదేశీ టూరిస్టులు తిరుపతి, విశాఖ, విజయవాడలో దిగాక ఎయిర్ పోర్టులోనే వీసా తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఏపీ టూరిజం కోసం బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తామన్నారు. రాజస్థాన్ లోని చౌకీ ధనీ, ఢిల్లీ హట్ ప్రాంతాలు భోజనానికి కేరాఫ్ గా నిలిచాయని అవంతి గుర్తుచేశారు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడి ఆహారపదార్థాలను రుచి చూసేందుకు వస్తుంటారని తెలిపారు. ఏపీలోని శిల్పారామాన్ని త్వరలోనే ఆ స్థాయిలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News