Yogi Adityanath: అవినీతి అధికారులకు నిర్బంధ పదవీ విరమణ అమలు చేయండి: అధికారులకు సీఎం యోగి ఆదేశాలు

  • అవినీతి అధికారుల పదోన్నతులు నిలిపివేయండి
  • సచివాలయంలో ఇకపై బయో మెట్రిక్ విధానం
  • అనుమతి లేకుండా సచివాలయంలోకి రానివ్వొద్దు

అవినీతి అధికారులకు తన ప్రభుత్వంలో తావు లేదని చెప్పిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అటువంటి అధికారుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు పరిపాలన శాఖ ముఖ్య అధికారులతో సమావేశమైన యోగి అవినీతి అధికారులకు నిర్బంధ పదవీ విరమణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అవినీతి అధికారులకు సంబంధించిన పదోన్నతులను కూడా నిలిపివేయాలని సూచించారు.

ఇకపై సచివాలయంలో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరినీ సచివాలయంలోకి అనుమతించవద్దని అధికారులకు యోగి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని యోగి అధికారులకు సూచించారు.

Yogi Adityanath
Uttar Pradesh
Retirement
Promotions
Bio metric
  • Loading...

More Telugu News