Kalava Srinivasulu: సుజనా, సీఎం రమేశ్ వంటి నేతలు చంద్రబాబుపై నమ్మకం కలిగినవారే కానీ ఒత్తిడికి గురయ్యారు!: కాలవ శ్రీనివాసులు

  • ఫలితాల అనంతరం ఒత్తిడికి గురయ్యారు
  • ఇంత త్వరగా వెళ్లిపోతారనుకోలేదు
  • చంద్రబాబు వచ్చాక టీడీపీ బలోపేతంపై చర్చిస్తాం

టీడీపీ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పందించారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి నేతలు చంద్రబాబుపై నమ్మకం కలిగినవారే అయినా, ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఒత్తిడికి గురయ్యారని అభిప్రాయపడ్డారు. ఇంత తక్కువ సమయంలో పార్టీని వీడతారని అనుకోలేదని కాలవ వ్యాఖ్యానించారు. చంద్రబాబు విదేశీ యాత్ర నుంచి వచ్చాక తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడంపై చర్చిస్తామని అన్నారు. టీడీపీకి ఇలాంటి సంక్షోభాలు కొత్తకాదని, పార్టీ ఈ కష్టాలను తట్టుకుని నిలబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Kalava Srinivasulu
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News