kcr: కేసీఆర్, కేటీఆర్ చేస్తున్నది సరికాదు.. హరీశ్ రావును కూడా పిలవాలి: చిన్నారెడ్డి

  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీశ్ పాత్ర ఉంది
  • ప్రారంభోత్సవానికి హరీశ్ ను కూడా పిలవాలి
  • ప్రాజెక్ట్ లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును కూడా పిలవాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ చాలా కష్టపడ్డారని చెప్పారు. తామే కష్టపడినట్టు తండ్రీకొడుకులు (కేసీఆర్, కేటీఆర్) ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం సరికాదని అన్నారు.

ప్రాజెక్ట్ లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని... ప్రాజెక్టుల్లో అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్, ఫడ్నవిస్ వచ్చినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు విడగొట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని సంతృప్తి పరిచేందుకే ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించారని విమర్శించారు.

kcr
KTR
harish rao
TRS
chinna reddy
congress
kaleshwaram
  • Loading...

More Telugu News