samanta: సమంతపై ప్రశంసలు కురిపించిన రాఘవేంద్రరావు

  • 'ఓ బేబీ' గురించి స్పందించిన రాఘవేంద్రరావు 
  • సమంత చాలా అద్భుతంగా నటించింది
  • సమంతకి మరింత మంచి పేరు రావడం ఖాయం

ఈ మధ్య కాలంలో సమంత వైవిధ్యభరితమైన కథల పట్ల ఆసక్తిని చూపుతోంది .. విభిన్నమైన పాత్రల వైపు మొగ్గుచూపుతోంది. అలా ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' సినిమా చేసింది. ఒకే శరీరంలో ఒక వయసుకి .. ఒక మనసుకి మధ్య జరిగే సంఘర్షణగా ఈ సినిమా నిర్మితమైంది.

24 ఏళ్ల యువతిగా సమంత .. ఆమెలో చొరబడిన 70 ఏళ్ల బామ్మగా సీనియర్ హీరోయిన్ లక్ష్మి చేశారు. నిజానికి ఈ పాత్రను పోషించడం చాలా కష్టం. ఇదే విషయాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు కూడా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన స్పందిస్తూ .. "ఈ సినిమాను నేను చూశాను .. చాలా కొత్తగా .. ఎమోషనల్ గా వుంది. సమంత 70 ఏళ్ల బామ్మగా చేసింది అనడం కన్నా, 70 ఏళ్ల అనుభవం కలిగిన నటిలా చేసింది అనడం సబబుగా ఉంటుంది. ఈ సినిమా తనకి మరింత పేరు తీసుకొస్తుంది" అని చెప్పుకొచ్చారు.

samanta
lakshmi
nagashourya
  • Loading...

More Telugu News