sai dharam tej: మళ్లీ మెగా హీరో జోడీ కడుతోన్న రాశీ ఖన్నా

  • తేజు హీరోగా మారుతి సినిమా
  • ఇద్దరు నాయికలకు అవకాశం
  •  త్వరలోనే సెట్స్ పైకి    

మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండటంతో, ఒక కథానాయికగా రుక్షార్ థిల్లోన్ ను తీసుకున్నారు. అదే స్థాయిలో మరో కథానాయికను తీసుకుంటే ప్రాజెక్టుపై క్రేజ్ తగ్గుతుందని భావించిన మారుతి, కాస్త క్రేజ్ వున్న గ్లామర్ హీరోయిన్ ను మొదటి నాయికగా తీసుకుంటే బాగుంటుందని భావించాడట.

కొంతమంది పేర్లను పరిశీలించిన ఆయన, రాశీ ఖన్నా వైపు మొగ్గుచూపుతున్నట్టుగా సమాచారం. ఆమె రెమ్యునరేషన్ తమ బడ్జెట్ పరిధిలోనే ఉండటం, ఆల్రెడీ తేజూతో ఆమె 'సుప్రీమ్' హిట్ కొట్టి ఉండటం వలన ఆమెనే ఖరారు చేసే ఆలోచనలో మారుతి వున్నాడని అంటున్నారు. మొత్తానికి మరోసారి ఈ జోడీ తెరపై సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

sai dharam tej
rasi khanna
  • Loading...

More Telugu News